About

శ్రీ కృష్ణ భగవానుడు చెప్పినట్టు “ఆచార ప్రభవో ధర్మః” అన్నది మన భారతీయుల సిద్ధాంతమ్. అంటే ఆచారాలతో ఆచరణతో ధర్మవర్ధనము జరుగును. మన పెద్దలు సంస్కృతి ఆచారాలు అన్న పేరుతో మన దైనందిన దినచర్యలలో ఈ ధర్మసూక్ష్మాలను నిక్షిప్తం చేసినారు. దీని వలన ప్రతి భారతీయుడు వేరేగా శాస్త్రాలు గ్రంథాలు చదవనక్కరలేకుండానే ధర్మం న్యాయం ఎఱిగి వర్తించెడివాడు. కాని దురదృష్ట వశాత్తు పడమటిగాలుల ప్రభావం వలన మన భారతీయ సంస్కృతి మీద మనకే హీనభావము ఏర్పడినది (ఈ క్రింది ఛాయాగ్రహమును చూడుము).

macaulay.jpg

మఱచిన భారతీయతను గుర్తుచేసేవిధముగా ఈ బ్లాగు లోని కథలు మన పురాణాలనుండి ఏఱబడినవి. ప్రతికథలోను నీతికి ప్రాధాన్యం ఇవ్వబడినది. మన ప్రాచీన గ్రంథాలు చదవాలనే జిజ్ఞాస పుట్టించటమే ఈ కథలయొక్క ముఖ్యోద్దేశమ్.

2 స్పందనలు to “About”

  1. cbrao అన్నారు:

    About లో మీ గురించి రాయండి.మీరు వాడే తెలుగు అంకెలు ఎక్కువమంది అర్ధము చేసుకొనజాలరు. తెలుగు అంకెలు వివరిస్తూ ఒక ప్రత్యేక వ్యాసము రాయగలరు. అందాక అందరికీ అర్ధమయ్యే అంకెలు వాడండి.

    About – Name-Sex-Place-Your special interests

    cbraoin at gmail.com

  2. యోగి అన్నారు:

    రోజు రోజుకూ పెరుగుతున్న తెలుగు బ్లాగుల్లో మీది అత్యుత్తమ బ్లాగుల్లో ఒకటి. మీరు ఇలాగే కొనసాగించాలని అభిలషిస్తూ, మిమ్మల్ని అభినందిస్తూ ..

    యోగి

ప్రత్యుత్తరమిమ్ము